Social 1080×1350 • Multi-page
05-06-2024 BREAKING NEWS 03:50 AM
swarnodayam.com
Telugu Daily News

కోర్టు ఆవరణంలో హరితహారం

కోర్టు ఆవరణంలో హరితహారం
IMG-20240605-WA0116

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

హుజురాబాద్ కోర్టు ఆవరణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం మొక్కలు నాటారు. ఫస్ట్ అడిషనల్ జేఎంఎఫ్సి పద్మ సాయి శ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోస్కుల శ్రీనివాస్ తో కలిసి మొక్కలు నాటారు. నాటిన మొక్కలకు నీరు పోసి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని, మొక్కలు నాటడం ద్వారా వాతావరణ సమతుల్యత కాపాడిన వారవుతారని వారు సూచించారు. ఈ వర్షాకాలంలో స్వచ్ఛందంగా ఒక్కొక్కరు ఐదు మొక్కలకు తగ్గకుండా నాటే విధంగా ముందుకు రావాలన్నారు. భారసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మట్టెల తిరుపతి, ఏ జి పి కేతరి శ్రీనివాస్ రెడ్డి, భారసోసియేషన్ సభ్యులు పూలుగు లింగారెడ్డి, మోసం మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!