Social 1080×1350 • Multi-page
05-06-2024 BREAKING NEWS 07:29 AM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ సోషల్ ‘ వార్ ‘

కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ సోషల్ ‘ వార్ ‘
IMG-20240605-WA0138

ఒకరిపై ఒకరు విమర్శలతో ప్రజల్లో గందరగోళం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జిల స్వగ్రామాల్లో పోలైన ఓట్లపై రభస నరుస్తుంది. కాంగ్రెస్- బిఆర్ఎస్ పార్టీలకు పోలైన ఓట్ల పై ఇరుపార్టీల సోషల్ మీడియా వారియర్లు సోషల్ మీడియా వేదికగా ‘ వార్ ‘ కి దిగారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ స్వగ్రామం హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కంటే బిజెపికి ఎక్కువ ఓట్లు పోలయ్యాయని.. కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ పరువు పోయిందంటూ బిఆర్ఎస్ సోషల్ మీడియా నేతలు ఆరోపించగా, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వగ్రామం వీణవంక గ్రామంలో అందరికంటే ఎక్కువ బిఆర్ఎస్ కు ఓట్లు పోలయ్యాయంటూ… ముందుగా బిఆర్ ఎస్ సోషల్ మీడియా నాయకులు పోస్టులు పెట్టారు. దీంతో తామేమి తక్కువ కాదంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఐదు నెలల్లోనే పార్లమెంటు ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల కన్నా బిఆర్ఎస్ పార్టీకి తక్కువ ఓట్లు పోలయ్యాయని సంఖ్యతో సహా రాయడం, కౌశిక్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో స్వగ్రామంలో పరువు నిలుపుకునేందుకు పార్టీ అగ్ర నేతలు కేసీఆర్, కేటీఆర్ లతో ప్రచారం చేయించుకుని, ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేశాడని.. ఓటర్లను ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్నాడని బాహాటంగా ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తూ పోస్టులు చేశారు. ఇలా కాంగ్రెస్, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిల పేరుతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ సోషల్ మీడియాలో రభస చేస్తున్నడంతో ఆ పోస్టులు చూసిన ఇతర సాధారణ ప్రజలు, ఓటర్లు, అధికారులు హవ్వ ఇదేమి వ్యవహారం అంటూ కాస్తంత నోచ్చుకుంటున్నారు. అయితే వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటు బ్యాంకు పార్లమెంటు ఎన్నికల వరకు నిలుపుకోకుండా బిఆర్ఎస్ నాయకులే అప్పుడు ఇప్పుడు ఓటు బ్యాంకును కాపాడుకున్న కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగడం.. స్వగ్రామాల పేరుతో రాజకీయ పాపం గడుపుకోవాలని ఇరు పార్టీల నేతలు చూడడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్, బిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లు తమ విమర్శలను మానుకొని ప్రజలను అయోమయానికి గురికాకుండా ఓటు బ్యాంకు రెండు పార్టీలకు కాకుండా బిజెపికి మెజార్టీ ఎలా వెల్లింది అనే దానిపై దృష్టి సారించి పోస్టుమార్టము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!