Social 1080×1350 • Multi-page
05-06-2024 BREAKING NEWS 08:11 AM
swarnodayam.com
Telugu Daily News

అనారోగ్యంతో డిగ్రీ కళాశాల అధ్యాపకుడి మృతి

అనారోగ్యంతో డిగ్రీ కళాశాల అధ్యాపకుడి మృతి
IMG-20240605-WA0127

-పలువురి సంతాపం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్; జూన్ 5 : హుజురాబాద్ మండలం సింగపూర్ లోని వీఎస్ ఆర్ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేస్తున్న గాజుల రఘు క్యాన్సర్ వ్యాధితో గత రెండు నెలల క్రితం అనారోగ్యం బారిన పడి హైదరాబాదులోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం రాత్రి మృతి చెందాడు. గత పది సంవత్సరాలు నుండి హుజురాబాద్ లోనీ హై స్కూల్, జూనియర్, డిగ్రీ, కళాశాలలో ఆంగ్ల భాషను బోధిస్తున్నాడు. రఘుకు భార్య, రెండు సంవత్సరముల కొడుకు, ఒక సంవత్సరం కూతురు ఉన్నారు. రఘు క్యాన్సర్ వ్యాధితో సరైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక అకస్మాత్తుగా చిన్న వయసులోనే మృతి చెందడం పలువురుని కలిసివేసింది. కాగా ఆయన మృతి పట్ల హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ బాబు, విఎస్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వివిఎన్ హనుమకుమార్, అధ్యాపకులు రఘు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!