Social 1080×1350 • Multi-page
06-06-2024 BREAKING NEWS 01:18 AM
swarnodayam.com
Telugu Daily News

ఫ్లాష్.. ఫ్లాష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలని మొదటి ప్రాధాన్యత ఓట్లు.. తప్పని ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.

ఫ్లాష్.. ఫ్లాష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలని మొదటి ప్రాధాన్యత ఓట్లు.. తప్పని ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.
IMG-20240605-WA0173

స్వర్ణోదయం ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండో రోజూ కొనసాగుతున్నది. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగింపు దశలో మూడో రౌండ్ కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఒకటి, రెండు రౌండ్స్ తో పోలిస్తే మూడో రౌండ్ లో 3000 ఓట్ల వరకు కాంగ్రెస్ మెజార్టీ తగ్గనున్నట్లు తెలుస్తుంది. కాగా నాల్గవ రౌండ్ లెక్కింపునకు అధికారులు సన్నాహాకాలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావొచ్చు అని అధికారుల అంచనా.

తొలి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటాకు దూరంగా ఇరువురు అభ్యర్థులు ఉండటంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనున్నట్లు తెలుస్తుంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే ఎమ్మెల్సీగా గెలిచే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!