06-06-2024 NORMAL NEWS 02:04 AM
swarnodayam.com
Telugu Daily News
06-06-2024 02:04 AM By Mandala Yadagiri

ఎమ్మెల్యే స్థాయిలో ఉండి సర్పంచ్ లా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి.

ఎమ్మెల్యే స్థాయిలో ఉండి సర్పంచ్ లా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి.
IMG-20240606-WA0170

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ద్వారానే ఎమ్మెల్యేగా గెలిచాడు..

రాముని పేరు చెప్పుకొని బిజెపి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది

కౌశిక్ రెడ్డి బాధితులు ఉన్నారు తప్ప.. ప్రణవ్ బాబు బాధితులు లేరు !

పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి వీణవంక సర్పంచ్ లా వ్యవహరిస్తున్నాడని పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. గురువారం హుజరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నాయకులతో కలిసి మాట్లాడారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వగ్రామం వీణవంకలో బిఆర్ఎస్ ఎక్కువ ఓట్లు వచ్చాయని, సింగపూర్ లో ప్రణవ్ కు తక్కువ వచ్చాయని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సిగ్గుచేటు అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వచ్చిన ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాకపోవడం చూస్తేనే హుజురాబాద్ ఎమ్మెల్యే మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయిన విషయం అందరికీ అర్థమవు తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి గెలిచారే తప్ప వేరేది కాదన్నారు. దేశంలో నరేంద్ర మోడీ కూడా రాముని పేరును అడ్డం పెట్టుకొని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాముడు గుడి కట్టిన రాష్ట్రంలోనే బిజెపికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. 400కు పైగా సీట్లు వస్తాయని చెప్పుకున్న బిజెపి పార్టీ అధికారం కోసం ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల సహకారం కోరుతుందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం వచ్చిందని, గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో బలపడిందన్నారు. కరీంనగర్ పార్లమెంటులో కూడా బండి సంజయ్ ని చూసి ఎవరు ఓటు వేయలేదని నరేంద్ర మోడీ రాజకీయంతోనే సంజయ్ గెలిచారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అని అన్నారు. ప్రణవ్ బాబు ఎంత సౌమ్యుడు హుజురాబాద్ ప్రజలందరికీ తెలుసుఅన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి బాధితులు ఉన్నారు తప్పా
ప్రణవ్ బాధితులు ఎవరూ లేరన్నారు. హుజురాబాద్ లో
బిజెపి, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కువ పట్టు ఉందని, కాంగ్రెస్ పార్టీ తర్వాతే ఈ రెండు పార్టీలు ఉంటాయన్నారు. హుజురాబాద్ నియోజకవర్గములో మొత్తం బీ.ఆర్.ఎస్ ప్రజా ప్రతినిధులు ఎక్కువగా ఉన్నప్పటికీ 47 వేల ఓట్లు సాధించడం గొప్పేమి కాదన్నారు. వీణవంకలో 500 ఓట్లు వచ్చింది కూడా కౌశిక్ రెడ్డి ని చూసి కాదని మాజీ సీఎం కేసీఆర్ ,కేటీఆర్, వీణవంకలో బస చేసి మీటింగ్ పెట్టడం వల్లే సాధ్యమైంది అన్నారు. ఇప్పటికైనా చిల్లర పనులు మానుకొని ఓటమికి గల కారణాలను వెతుక్కుంటే మంచిదని హితువు పలికారు.మీడియా సమావేశం లో
కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు ,కొల్లూరి కిరణ్ కుమార్,వేముల పుష్పలత, సుశీల, ఎర్ర రమేష్, మహేశ్వరి,అఫ్సర్, రామరావు, సుంకరి రమేష్,కుర్ర శ్రీనివాస్, వినోద్ రెడ్డి, నరసింగం, సూర్య, అనిల్, దిక్షిత్, సతీష్ రెడ్డి, లింగారావు, సదానందంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!