06-06-2024 NORMAL NEWS 05:59 AM
swarnodayam.com
Telugu Daily News
06-06-2024 05:59 AM By Mandala Yadagiri

ఏఐఎస్బి 74వ వార్షికోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

ఏఐఎస్బి 74వ వార్షికోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
IMG-20240606-WA0179

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

చొప్పదండి నియోజకవర్గంలో ఏఐఎస్బి వార్షికోత్సవాల పోస్టర్స్ ను ఏఐఎస్.బి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ గురువారం ఆవిష్కరించారు. జూన్ 25న జరిగే అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్.బి 74వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏఐఎస్.బి 74వ వార్షికోత్సవాల పోస్టర్ల ను కొలుగూరి సూర్య కిరణ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్.బి రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్ పాల్గొని వార్షికోత్సవాల పోస్టర్ల ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్బి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఏఐఎస్.బి 1951లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఏర్పడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనకై కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సోషలిజం సాధనకై నేతాజీ కలలు కన్నా భారతదేశ పుననిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వ విద్యా సంస్థల యూనివర్సిటీల పరిరక్షణకై విద్య కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా గత 73వ సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని ఆయన కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా 74వ వార్షికోత్సవాలను ఏఐఎస్.బి శ్రేణులు ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణు, మహేష్, శేఖర్, వంశీ, గణేష్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!