Social 1080×1350 • Multi-page
06-06-2024 BREAKING NEWS 07:18 AM
swarnodayam.com
Telugu Daily News

చెల్లని ఓట్లతో అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్..

చెల్లని ఓట్లతో అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్..
IMG-20240605-WA0173-1

-ఫోన్ పే చేయాలంటూ నంబర్లు రాసిన పట్టభద్రులు..

-అభ్యర్ధుల అంచనాలు తారు మారు….

స్వర్ణోదయం ప్రతినిధి, నల్గొండ: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా మూడు రౌండ్ లు ముగిసేసరికి 20 వేలకు పైగా చెల్లని ఓట్లు రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ ఒక్క అభ్యర్థికి 50 శాతంకు మించి రాకపోవడంతో ఈ టెన్షన్ లకు ప్రధాన కారణమైంది.

చెల్లని ఓట్లలో పట్టభద్రుల చిత్రవిచిత్ర వేషాలు….

బ్యాలెట్ పేపర్ లో జై మల్లన్న, జై రాకేష్ రెడ్డి అంటూ కొందరి రాతలు, అభ్యర్దిని ప్రశంసిస్తూ ఆప్షన్ అంకె వేయకుండా ఐలవ్ యూ అని పట్టభద్రులు రాయడంతో ఇదేమి విచిత్రమో అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే మరి కొంతమంది మేధావులు, పట్టభద్రులు తమ ఫోన్ పే నెంబర్ రాసి డబ్బులు కొట్టాలని పేర్కొనడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఆ నెంబర్లు ఆధారంగా వారిపై కేసు చేసే అవకాశం లేకపోలేదు. ఇంకా మరికొంతమంది మాత్రం పిచ్చి పాతాళానికి చేరింది అనడానికి ఇదే ఉదాహరణ. ఖాళీ బ్యాలెట్ పేపర్ వేసి పైశాచిక ఆనందం పొందడం తో పట్టభద్రులకు మతిభ్రమించిందా ఏంది అన్నట్లుగా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రధాన పార్టీ అభ్యర్థులకు పడిన ఓట్లకు దగ్గరిదాకా చెల్లని ఓట్లు ఉండడం అధికారులను అయోమయానికి గురిచేస్తుంది. పట్టభద్రుల అతి, అవగాహన లోపం కారణంగా అభ్యర్థుల్లో టెన్షన్ నెలకోనడమే కాక ఫలితం రెండవ రోజు కూడా ఎటు తేలక పోవడంతో తలలు పట్టుకుంటున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!