Social 1080×1350 • Multi-page
06-06-2024 BREAKING NEWS 08:19 AM
swarnodayam.com
Telugu Daily News

ఈ అమ్మకు న్యాయం చేయండి..!

ఈ అమ్మకు న్యాయం చేయండి..!
IMG-20240606-WA0214

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కమలాపూర్:

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన జక్కుల మల్లమ్మకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. మల్లమ్మ భర్త చనిపోగా కొడుకులు తల్లి కోసం ఒక రేకుల షెడ్డును నిర్మించి అందులో నివాసం ఉంచారు. బుధవారం కొడుకులకు, కోడళ్ళకు మనస్పర్ధలు రావడంతో తల్లిని ఇంటి నుండి బయటకు పంపించారు. ఇక మల్లమ్మ అప్పటి నుండి రోడ్డు పక్కనే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతుంది. కన్న కొడుకులు, తన కోడలు మనస్పర్ధలు రావడంతో తనను బయటకి పంపించారని మల్లమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయమని ఈ వృద్దురాలు పలువురిన వేడుకుంటుంది. ఇక మల్లమ్మ పరిస్థితిని చూసిన జనం కన్నీటి పర్యంతం అవుతున్నారు. కాటికి కాలుజాచిన వృద్ధురాలని కూడా చూడకుండా కాటిన్యంగా బయటికి పంపిన ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఆమెను ఆదుకోవడానికి ముందుకు రావాలని, అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని మల్లమ్మ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని మానవతావాదులు కోరుతున్నారు.
 

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!