07-06-2024 NORMAL NEWS 08:14 AM
swarnodayam.com
Telugu Daily News
07-06-2024 08:14 AM By Mandala Yadagiri

ఫ్లాష్.. ఫ్లాష్… అనుమతి లేని విత్తనాల విక్రయము.. వ్యక్తి పై కేసు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
అనుమతులు లేకుండా రైతులకు విత్తనాలు విక్రయిస్తున్న మేడ్చల్ జిల్లాకు చెందిన శాంభవి అగ్రి సీడ్స్ ప్రతినిధి రాచపల్లి లింగయ్య పై కేసు నమోదు చేసినట్లు హుజురాబాద్ టౌన్ సిఐ బొల్లం రమేష్ శుక్రవారం తెలిపారు. మండలంలో అనుమతులు లేకుండా లింగయ్య పలువురు రైతులకు ఏలాంటి అనుమతులు లేకుండా 20 కిలోల విత్తనాలవి 141 బస్తాలను విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా అందిన సమాచారం మేరకు అతనిపై 6ఏ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖ ఏడిఏ గుండా సునీత, ఏవో సిహెచ్ సునీల్ కుమార్ లు సైతం సంఘటన స్థలానికి వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. హుజురాబాద్ ప్రాంతంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారం గుప్పు మనడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!