Social 1080×1350 • Multi-page
08-06-2024 BREAKING NEWS 06:27 AM
swarnodayam.com
Telugu Daily News

అవినీతికి పాల్పడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ని భర్త రఫ్ చేయాలి.. రోజుకు రూ. 50 లక్షలు సంపాదిస్తున్న మంత్రి

అవినీతికి పాల్పడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ని భర్త రఫ్ చేయాలి.. రోజుకు రూ. 50 లక్షలు సంపాదిస్తున్న మంత్రి
IMG-20240608-WA0122

–బూడిద లారీలను అడ్డుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులతో కుమ్మక్కై రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని, అలాంటి వ్యక్తిని మంత్రి పదవి నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. శనివారం వే బిల్లు లేకుండా అధిక లోడ్ తో వెళ్తున్న శనివారం ఆయన అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం 32 టన్నులతో పోవాల్సిన లారీలు 80 టన్నుల లోడ్ తో వెళ్తున్న ఫ్లై యాష్ లారీలను అడ్డుకునే నాధుడే కరువయ్యారని ఆరోపించారు. రోజుకి రెండు మూడు వందల ఫ్లై యాష్ లారీలు రామగుండం లోని ఎన్ టి పి సి నుంచి ఖమ్మం కు వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. మంత్రి కనుసన్నాలోనే ఈ అక్రమ ఫ్లై యాష్ రవాణా జరుగుతుందన్నారు. ఒక్కో లారీలో సుమారు 70 నుంచి 100 టన్నులు కూడా ఉంటుందని అన్నారు. ఈ రవాణా ద్వారా నెలకు వందల కోట్ల స్కాము జరుగుతుందన్నారు. ఈ రవాణా ద్వారా వందల కోట్ల స్కాం జరుగుతున్న అధికారులు మంత్రి మండలి ఎందుకు పట్టించుకోవడం లేదు అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు ఉందన్నారు. ఇంత పెద్ద స్కాం ను లైవ్ లో నేడు పట్టుకున్నామని తెలిపారు. ఒక లారీ వెళ్లడానికి సుమారు 25 వేల వరకు ఖర్చు అవుతుందని, అందులో కేవలం 32 టన్నులు వెళ్లడానికి మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు. 32 టన్నులు మాత్రమే పోవాలి అలాంటిది 70 నుంచి 100 టన్నులతో వరకు తీసుకువెళ్తున్నారని అన్నారు. అక్రమంగా తరలిస్తున్న దానిపై వచ్చే ఆదాయం ఒక్కోలారికి 40,000 వరకు ఉంటుందని రోజుకు రెండు నుంచి 300 లారీలు వెళ్తే సుమారు 50 లక్షలు వరకు అవుతుందని అన్నారు. మంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఇప్పటి వరకు 100 కోట్లు స్కామ్ చేసారని ఆయన అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ ను పదవి నుంచి భర్త రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ఎస్ పార్టీ తరపున విచారణ కమిటీ వేసేందుకు డిమాండ్ చేస్తామని తెలిపారు. రెండు రోజుల క్రితం బూడిద లారీలను 15 వరకు పట్టుకోగా కేవలం రెండు లారీలపై మామ మాత్రం జరిమానా విధించి మిగతా లారీలను వదిలేసారని నంబర్లతో సహా వివరించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు గందె రాధిక శ్రీనివాస్, తక్కలపల్లి రాజేశ్వరరావు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!