09-06-2024 NORMAL NEWS 05:06 AM
swarnodayam.com
Telugu Daily News
09-06-2024 05:06 AM By Mandala Yadagiri

మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు మానుకో.. కౌశిక్ రెడ్డి!మంత్రి కి ఫ్లై యాష్ తో సంబంధం ఏమిటి?

మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు మానుకో.. కౌశిక్ రెడ్డి!మంత్రి కి ఫ్లై యాష్ తో సంబంధం ఏమిటి?
IMG-20240609-WA0106

-ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇసుక అక్రమ రవాణా చేసింది ఎవరు

-ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను మోసం చేసింది మీరు కాదా

-పొన్నం ప్రభాకర్ ఎదుగుదల ఓర్వలేకనే నిందలు వేస్తున్నాడు

-తప్పు ఎవరు చేస్తే వాళ్ళం అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు భూమికి రాయనికి సిద్ధమా

యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

ప్లే యాష్ లో రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోజుకి 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్ అన్నారు. ఎమ్మెల్యే శనివారం చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినంత మాత్రాన ఫ్లై యాష్ కి మంత్రికి ఏం సంబంధం ఉంటుందని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండి ఇసుక అక్రమ రవాణా చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. దళిత బిడ్డ మోరే మధుతో నాపై అసత్య మాటలు చెప్పిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దమ్ముంటే నా తప్పులు నిరూపించి మాట్లాడండి. ఎన్ఎస్యుఐలో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చేస్తే అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు భూమికి రాస్తానని, ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఉన్నప్పుడు చేసిన అక్రమాలు నిరూపిస్తే అదే అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు భూమికి రాస్తావా అంటూ సవాల్ విసిరారు.
ఇసుక అక్రమ రవాణా ద్వారా నియోజకవర్గానికి ఎంత ఇబ్బందులు ఎదురయ్యాయో ప్రతి ఒక్కరికి తెలుసు అన్నారు. గతంలో కూడా యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు వసూలు చేయలేదా అని ఆయన ప్రశ్నించారు?. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తాను చేసిన ఎన్నో అక్రమాలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మీద వ్యక్తిగతంగా ఉన్న కోపంతోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. సాధారణ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన బీసీ బిడ్డను చూసి ఓర్వలేకనే నిందలు వేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఇంతవరకు చిన్న ఆరోపణ కూడా లేదని అన్నారు. మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం మానుకోవాలన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటివరకు నియోజకవర్గానికి చేసింది ఏమిటో చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో కౌశిక్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చాలో వాటిపై దృష్టి సారించాలని హితవు పలికారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!