Social 1080×1350 • Multi-page
09-06-2024 BREAKING NEWS 05:35 AM
swarnodayam.com
Telugu Daily News

పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు

పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు
IMG-20240609-WA0134

-పొన్నం ప్రభాకర్ పై పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు అవాస్తవం

-ఉద్యమ నాయకుడి పై ఉద్యమ ద్రోహి అక్కసు

-రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ సేవలు అద్వితీయం

–టిపిసిసి ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ అన్నారు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవమని టిపిసిసి ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ అన్నారు. రాష్ట్ర రవాణా శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని రవాణా శాఖ మంత్రి రోజుకు 50 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేయడం సహించరానిదని, పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని దొంత రమేష్ హెచ్చరించారు. లారీ డ్రైవర్లు వాల్ల కాల కృత్యాలను తీర్చుకోవడానికి రోడ్డు పక్కన లారీలను నిలుపగా పాడి కౌశిక్ రెడ్డి డ్రైవర్ల పై దౌర్జన్యం చేస్తూ లారీలల్లో అక్రమ రవాణా జరుగుతుందని దానికి పొన్నం బాధ్యులని లారీల డ్రైవర్లపై బెదిరింపులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమో కౌశిక్ రెడ్డి జవాబు చెప్పాలన్నారు. నికార్సైన ఉద్యమ నాయకుడి పై ఒక ఉద్యమ ద్రోహి ఇలాంటి ఆరోపణలు చేయడం, అక్కసు వెలిబుచ్చడం సిగ్గుచేటని పేర్కొన్నారు. లారీలో బూడిద ఎన్ని టన్నులు పడుతుందో అవగాహన లేకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని, 32 టన్నుల వాహనంలో 70 టన్నుల బూడిద తరలిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశాదాని, 32 టన్నుల లారీలో 32 టన్నుల బూడిద కూడా పట్టదని కౌశిక్ రెడ్డి తెలుసుకోవాలని, 70 టన్నుల బూడిద 32 టన్నుల లారీలో పడుతుందని కౌశిక్ రెడ్డి నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర మంత్రివర్గంలో పొన్నం ప్రభాకర్ కు ప్రజల నుండి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే కౌశిక్ రెడ్డి ఇలాంటి చౌక బారు ఆరోపణలు చేస్తున్నారని, మరొకసారి పొన్నం ప్రభాకర్ పై ఏలాంటి తప్పుడు ప్రచారాలు చేసిన కౌశిక్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సందమల్ల బాబు, బత్తిని రవీందర్ గౌడ్, సందమల్ల నరేష్, దుబాసి బాబు, జంగా అనిల్ కుమార్, దాసరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!