09-06-2024 NORMAL NEWS 10:00 AM
swarnodayam.com
Telugu Daily News
09-06-2024 10:00 AM By Mandala Yadagiri

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…
IMG-20240609-WA0200


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1996 -97వ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హుజురాబాద్ లోని విశేష ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. 27 సంవత్సరాల తర్వాత విద్యార్థులంతా ఆనందంగా గడిపారు. పాఠశాల ప్రధానాచార్యులు కళ్ళెపు సుధాకర్ రావు, బలగం కొమురయ్య (సుధాకర్ రెడ్డి) ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వాచార్యులు ఆగయ్య, రవీందర్ రెడ్డి, రామ్ రెడ్డి, తంగళ్ళపల్లి రమేష్, హుస్సేన్, శ్రీకాంత్ శర్మ, మురళీధర్ తో పాటు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!