09-06-2024 NORMAL NEWS 10:25 AM
swarnodayam.com
Telugu Daily News
09-06-2024 10:25 AM By Mandala Yadagiri

ఉమ్మడి రాష్ట్రస్థాయి నాటిక పోటీలకు రావుల పుల్లాచారి రచించిన వీలునామా నాటిక ఎంపిక

ఉమ్మడి రాష్ట్రస్థాయి నాటిక పోటీలకు రావుల పుల్లాచారి రచించిన వీలునామా నాటిక ఎంపిక
IMG-20240609-WA0209

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక తెలంగాణ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 15వ ఉభయ రాష్ట్రాల నాటిక పోటీలు ఈనెల 9, 10, 11 న జరగనున్నాయి. ఈ మూడు రోజులు పోతన విజ్ఞాన పీఠం వరంగల్ లో నిర్వహిస్తున్న పోటీలలో కాకతీయ కళా సమితి హుజురాబాద్ వారు పట్టణానికి చెందిన నంది అవార్డు గ్రహీత, కవి, రచయిత రావుల పుల్లాచారి రచించిన వీలునామా నాటికను ఎంపిక చేశారు. ఈనాటికకు దర్శకత్వం డాక్టర్ మల్లేష్ బల్లాస్ట్ వహించగా నటీనటులు హుజురాబాద్ కు చెందిన కుడికాల ప్రభాకర్, మూదం కుమారస్వామి, నీరుపాటి ఆనంద్, భాషబోయిన ఐలయ్య, హీరోయిన్ జ్యోతిరాణి విజయనగరం జిల్లా వారు ప్రధాన భూమికలు పోషిస్తున్నారన్నారు. 10వ తేది సోమవారం రోజున రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ప్రదర్శించబోతున్నామని సంస్థ ప్రధాన కార్యదర్శి కుడికాల ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!