Social 1080×1350 • Multi-page
09-06-2024 BREAKING NEWS 10:45 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రధాని మోడీ, బండి, కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం పట్ల బిజెపి శ్రేణుల సంబరాలు..

ప్రధాని మోడీ, బండి, కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం పట్ల బిజెపి శ్రేణుల సంబరాలు..
IMG-20240609-WA0217

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మరియు తెలంగాణ నుంచి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హుజురాబాద్లో హుజురాబాద్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, సీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. జై మోడీ జై జై మోడీ అంటూ నినాదాలు చేశారు. మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం కల్పించి, బండి సంజయ్ కి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించిన ప్రధాని మోడీ, బిజెపి కేంద్ర పార్టీ అధినేతలకు హుజురాబాద్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టీ రాజు, మండల అధ్యక్షులు రాముల కుమార్, హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, కౌన్సిలర్ పైల వెంకటరెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు రావుల వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, గంగిషెట్టి ప్రభాకర్, యాళ్ళ సంజీవరెడ్డి, సబ్బని రమేష్, తూముల శ్రీనివాస్, ఆంకతి వాసు, బూత్ అద్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!