Social 1080×1350 • Multi-page
10-06-2024 BREAKING NEWS 12:26 AM
swarnodayam.com
Telugu Daily News

రిటైర్డ్ ఏఈఓ మిడిదొడ్డి బొందయ్యకు దళిత, ప్రజా సంఘాల ఘన నివాళి

రిటైర్డ్ ఏఈఓ మిడిదొడ్డి బొందయ్యకు దళిత, ప్రజా సంఘాల ఘన నివాళి
IMG-20240610-WA0064

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ వ్యవసాయ విస్తరణ అధికారి మిడిదొడ్డి బొందయ్య(74) అనారోగ్యం కారణంగా ఆదివారం రాత్రి కరీంనగర్ హాస్పిటల్ లో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న హుజురాబాద్ మాదిగ మేధావుల ఫోరం గౌరవ అధ్యక్షులు వేల్పుల రత్నం, ప్రధాన కార్యదర్శి రొంటాల సుమన్, ప్రచార కార్యదర్శి డాక్టర్ తడికమళ్ళ శేఖర్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఇల్లందుల సమ్మయ్య, కండె తిరుపతి, మొలుగూరి కొమరయ్య తదితరులు తుమ్మనపల్లి వెళ్లి బొందయ్య పార్థీవ దేహానికి పూల దండలతో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బొందయ్యతో తమ కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బొందయ్య గారి అల్లుడు మేకల మొగిలయ్య , కుటుంబ సభ్యులు, మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!