Social 1080×1350 • Multi-page
10-06-2024 BREAKING NEWS 08:09 AM
swarnodayam.com
Telugu Daily News

చిల్లర రాజకీయాలు మానుకో కౌశిక్ రెడ్డి

చిల్లర రాజకీయాలు మానుకో కౌశిక్ రెడ్డి
IMG-20240610-WA0087
  • ఎల్కతుర్తిలో కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతల ధర్నా

–అవినీతి మచ్చ లేని నేత పొన్నం ప్రభాకర్

-పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందే.!

-కాంగ్రెస్ నేతల డిమాండ్

స్వర్ణోదయం ప్రతినిధి, ఎల్కతుర్తి: హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎల్కతుర్తి బస్టాండ్ ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలు చేశారు. అవినీతి మచ్చ లేనీ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయంగా చిన్నపిల్లల మనస్తత్వంగా కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. ఏదో చేద్దామని మనిషిపై నిందలు మోపి మచ్చ తెచ్చే కార్యక్రమానికి సిద్ధపడుతున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దమ్ముంటే నిజానిజాలతో పాటుగా ఆధారాలతో చూపించాలి తప్ప మచ్చలేని మనిషి మీద నిందలు వేస్తే సహించేది లేదన్నారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి గత ఎన్నికలలో ఓడిపోతామనే బ్రమతో భార్యను తన పిల్లలను బహిరంగంగా గెలిపించకపోతే చనిపోతామని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి అవినీతి లేనటువంటి మంత్రిపై అనుచుతిగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. దమ్ముంటే ఆధారాలతో చూపెట్టాలని, చిన్నపిల్లల మనస్తత్వంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొల్సి వస్తుందని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డితో పాటుగా మాజీ అధ్యక్షుడు సుకినే సంతాజి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ ముప్పు మహేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు హింగే శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబాల శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శనిగరపు వెంకటేష్, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు అంబాల స్వామి, ఎల్కతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, శనిగరపు సాహూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!