Social 1080×1350 • Multi-page
10-06-2024 BREAKING NEWS 08:30 AM
swarnodayam.com
Telugu Daily News

బడిబాటలో ఉపాధ్యాయుల విస్తృత ప్రచారం..

బడిబాటలో ఉపాధ్యాయుల విస్తృత ప్రచారం..
IMG-20240610-WA0092

స్వర్ణోదయం ప్రతినిధి, సైదాపూర్: ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఉపాద్యాయులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మండల కేంద్రంలోని వెన్కేపల్లి ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు మండలంలోని సైదాపూర్, వెన్కేపల్లి, జాగిరిపల్లి, గర్రెపల్లి, ఘనపూర్, బొత్తలపల్లి, రామచంద్రాపూర్, కురుమపల్లి గ్రామాలలో ఇంటింటా తిరుగుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు, డిజిటల్ విద్యాబోధన, అత్యాధునిక సౌకర్యాలు, ఉచిత పుస్తకాలు, సన్నబియ్యంతో నాణ్యమైన ఉచిత మధ్యాహ్న బోజనంతో పాటు యునిఫాం ఇస్తున్నట్లు ఉపాద్యాయులు చెబుతున్నారు. ఈ విద్యాసంవత్సరం వెన్కేపల్లి పాఠశాలలో10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. మానసిక ఉల్లాసం పంచే ఆహ్లాదకర విశాల మైదానంలో క్రీడా నైపుణ్య శిక్షణ, సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు, జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన వెన్కేపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెరుగు దేవేందర్ రెడ్డి కోరారు. ఈ బడిబాట కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, సీనియర్ విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!