10-06-2024 NORMAL NEWS 10:34 AM
swarnodayam.com
Telugu Daily News
10-06-2024 10:34 AM By Mandala Yadagiri

రేపు టీఎస్ ఎడ్‌సెట్ 2024 ఫ‌లితాలు విడుద‌ల‌.

రేపు టీఎస్ ఎడ్‌సెట్ 2024 ఫ‌లితాలు విడుద‌ల‌.
IMG-20240530-WA0149

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

టీఎస్ ఎడ్‌సెట్ -2024 ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు మంగ‌ళ‌వారం విడుద‌ల కానున్నాయి. 11న మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఆన్‌లైన్ కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో మే 23వ తేదీన ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించారు. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు 87 శాతం మంది హాజ‌ర‌య్యారు. టీఎస్ ఎడ్‌సెట్‌కు 33,879 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

అయితే వీరికి రెండు సెష‌న్ల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. సెష‌న్‌-1లో 16,929 మందికి గానూ 14,633 మంది, సెష‌న్-2లో 16,950 మందికి గానూ 14,830 మంది అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!