Social 1080×1350 • Multi-page
11-06-2024 BREAKING NEWS 09:59 AM
swarnodayam.com
Telugu Daily News

గర్రెపల్లి రోడ్డు నిర్మాణంకు నిధులు మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు..

గర్రెపల్లి రోడ్డు నిర్మాణంకు నిధులు మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు..
IMG-20240611-WA0196

దశాబ్దాల కల నెరవేరిందన్న గ్రామస్తులు…

స్వర్ణోదయం ప్రతినిధి, సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామ పరిధిలోని గర్రెపల్లి రోడ్డు నిర్మాణం కోసం 2కోట్ల 18లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు గర్రెపల్లి ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. మంగళవారం గ్రామస్తులు గర్రెపల్లి కు వేసిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు నిర్మాణం పూర్తి అవ్వడంతోమాజీ ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.గతంలో వర్షం పడితే గర్రెపల్లి నుండి బయటి గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేకపోయేదని రోడ్డు నిర్మాణం బ్రిడ్జి నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండడంతో సంతోషంగా ఉందన్నారు. గర్రెపల్లెకు రోడ్డు నిర్మాణం పూర్తయ్యలా నిరంతరం తమకు వెన్నట్టు ఉండి తమ సమస్యలను పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసిన జర్నలిస్టులకు గర్రెపల్లి ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీసర్పంచ్ పైడిమల సుశీల తిరుపతి గౌడ్,కందుల అంజి, దోకిడి తిరుపతి, వర్ణే మోహన్ రావు, తిరుపతి, రాజాబాబు, కుమారస్వామి తదితరులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!