Social 1080×1350 • Multi-page
12-06-2024 BREAKING NEWS 03:40 AM
swarnodayam.com
Telugu Daily News

నిరాధార ఆరోపణలు చేస్తే సహించేదే లేదు..కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కే రాజు

నిరాధార ఆరోపణలు చేస్తే సహించేదే లేదు..కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కే రాజు
IMG-20240612-WA0093

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇంకోసారి ఇలా జరిగితే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి కొలుగూరి రాజు అన్నారు. బుధవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లేయర్స్ స్కాం అంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎమ్మెల్యే మంత్రిపై నిందలు వేయడం సరికాదని అన్నారు. వ్యక్తిగతమైన మైలేజ్ పెంచుకోవడానికి కౌశిక్ రెడ్డి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారని అన్నారు. దమ్ముంటే ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి రాజకీయం చేయకముందే పొన్నం ప్రభాకర్ రాజకీయంగా గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పారు. మంత్రిపై ఇంకోసారి పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తే ఎక్కడికి అక్కడే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వైస్ ఎంపీపీ మాడుగుల ఎద్రా, కిషోర్ కుమార్, మాచర్ల సదానందంగౌడ్, శ్రవణ్ కుమార్, సంపత్ కుమార్, షకీల్, మహేష్, గుడికంతుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!