Social 1080×1350 • Multi-page
12-06-2024 BREAKING NEWS 06:14 AM
swarnodayam.com
Telugu Daily News

పీఎం మోడీకి పవన్ రిక్వెస్ట్! అదేంటంటే..ప్రమాణ స్వీకారం వేళ ఆసక్తికర పరిణామం…

పీఎం మోడీకి పవన్ రిక్వెస్ట్! అదేంటంటే..ప్రమాణ స్వీకారం వేళ ఆసక్తికర పరిణామం…
Screenshot_20240612-123217_WhatsApp

స్వర్ణోదయం ప్రతినిధి, విజయవాడ:

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బుధవారం(జూన్ 12న) ప్రమాణం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్ళిపోతున్న ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రిక్వెస్ట్ చేశారు.

అన్నయ్య(చిరంజీవి) కలుస్తారని పవన్ కోరగా..మోడీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. మెగా బ్రదర్స్‌ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరినీ అభినందించారు. చిరంజీవి..పవన్ గడ్డాన్ని పట్టుకుని మోడీ ముందు తన తమ్ముడిని అభినందిస్తుండగా రామ్ చరణ్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!