Social 1080×1350 • Multi-page
12-06-2024 BREAKING NEWS 07:41 AM
swarnodayam.com
Telugu Daily News

పవన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా అల్లు ఫ్యామిలీ?

పవన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా అల్లు ఫ్యామిలీ?
IMG-20240612-WA0148

ఎన్నికల ప్రచారంతో ముదిరిన విభేదాలు!

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:

మెగా కుటుంబానికి అల్లు ఫ్యామిలీ క్రమంగా దూరమవుతోందనే ఊహాగానాలు కొనసాగుతుండగా బుధవారం పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాకపోవడం దానికి ఆజ్యం పోస్తుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఇంటికెళ్లి బన్ని మద్దతివ్వడం, ఆ తర్వాత నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే! అనంతరం ఇటీవల మెగా కుటుంబ సభ్యుడైన సాయి ధరమ్ తేజ్ ట్విటర్లో అల్లు అర్జున్ ను అన్ ఫాలో కొట్టారు. ఇటీవల ఇరు కుటుంబాల మధ్య సఖ్యత లేదని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుండగా దీనికి జనసేనాని ప్రమాణస్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చినట్లు తేటతెల్లమవుతుంది. ఏది ఏమైనా చిరంజీవి అల్లు ఫ్యామిలీ వేబేదాలు రావడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది.

అసలు ఆహ్వానం అందిందో? లేదో? తెలియదు.

దీనిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!