Social 1080×1350 • Multi-page
12-06-2024 BREAKING NEWS 11:59 AM
swarnodayam.com
Telugu Daily News

ఢిల్లీలోనీ మ్యూజియంలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలోనీ మ్యూజియంలకు బాంబు బెదిరింపులు
IMG-20240612-WA0151

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ:

దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియంలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆయా మ్యూజియంల వద్ద తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది బూటకపు మెయిల్‌ అని భావిస్తున్నారు. కేసు నమోదు చేశారు. బూటకపు మెయిల్స్ పై ఆరా తీస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!