13-06-2024 NORMAL NEWS 01:28 AM
swarnodayam.com
Telugu Daily News
13-06-2024 01:28 AM By Mandala Yadagiri

అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారిని వదిలిపెట్టాలి.. -మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత

అక్రమంగా అదుపులోకి తీసుకున్న వారిని వదిలిపెట్టాలి.. -మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత
Screenshot_20240613-121318_All PDF Reader

స్వర్ణోదయం ప్రతినిధి, ములుగు: ఈ నెల 12వ తేదీన ములుగు జిల్లా, వెంకటాపురం మండలం తడుపాలా గ్రామం వద్ద రాత్రి 10 గంటలకు గ్రేహౌండ్స్ పోలీసులు నిరాయుధులైన ముగ్గురి సభ్యులు రీతా, మోతీ, ఇడ్మాల్ లతో పాటు తమ పనుల రిత్యా అడవికి వెళ్తున్న ముగ్గురు ప్రజలను మార్గ మద్యలో పట్టుకొని వారిని ఎన్ కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత గురువారం ఒక ప్రకటనలో ఎలాంటి సంబంధం లేని అమాయకులను బాంబుల గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టు చేసినా వారిని 24గంటల్లో కోర్టులో హాజరు పర్చాలని, ప్రజలు. ప్రజాస్వామిక వాదులు, బుద్ధి జీవులు పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను వ్యతిరేకించాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పిలుపునిచ్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!