Social 1080×1350 • Multi-page
13-06-2024 BREAKING NEWS 05:53 AM
swarnodayam.com
Telugu Daily News

పోలీసుల నిజాయితీ…

పోలీసుల నిజాయితీ…
IMG-20240613-WA0133

స్వర్ణోదయ ప్రతినిధి, హుజూర్ నగర్:

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ పోగొట్టుకున్న రూ 34 వేల రూపాయలను నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఏఎస్ ఐ రమేష్, కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డ్స్ చిన్నప్ప, గోపయ్యకు తెలపగా వారు వెంటనే స్పందించారు.
హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వారు కోదాడ నుండి హుజూర్ నగర్ కు వస్తూ రాత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ డబ్బులున్న సంచి మర్చిపోయారు. ఇదే విషయం పై హుజూర్ నగర్ పోలీసు స్టేషన్ ను నైట్ పెట్రోలింగ్ లో ఉన్న ఎఎస్ ఐ రమేష్ కు తెలపగా వెంటనే స్పందించి మిర్యాలగూడ డిపోకి పోన్ చేసి డ్యూటీలో ఉన్న అర్ టిసి డ్రైవర్ నెంబరు తీసుకుని పోన్ చేసి విషయం చెప్పగా బస్సు డ్రైవర్ అదే బస్ లో వీళ్ళు మర్చిపోయిన సంచిని, అదే సంచిలో ఉన్న వారీ దుస్తులు ₹34000లను గుర్తించి వాటిని మిర్యాలగూడెం డిపోల అప్పగించారు. పోలీసులు వాటిని రికవరీ చేసుకొని గురువారం బాధితులకు హుజూర్ నగర్ సీఐ చరమందరాజు, ఎస్ ఐ ముత్తయ్య, ఎఎస్ ఐ రమేష్ చేతుల మీదగా బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా సీఐ చరమందరాజు మాట్లాడుతూ…. హుజూర్ నగర్ పట్టణంలోని ఫణిగిరిగట్టు వద్ద నివాసం ఉంటున్న ఆవుల శంభయ్య- లక్ష్మీ దంపతులు వీరి కులం బుడబుక్కల. వృత్తి యాచక వృత్తి. వీళ్ళు మేడారం జాతర, భద్రాచలం,వీరభద్రస్వామీ దేవాలయవద్ధ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. వారు ₹34000 లున్న నగదు సంచితో బుదవారం రాత్రి కోదాడ నుండి హుజూర్ నగర్ కు వచ్చేందుకు మిర్యాలగుడెం డిపోకు చెందిన అర్ టిసి డీలక్స్ TS 05 Z 0217 బస్ లో ప్రయణం చేస్తూ రాత్రి 11 గంటల సమయంలో హుజూర్ నగర్ లో దిగారు. నగదు ఉన్న సంచి బస్ లోనే మర్చి పోవడంతో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులకు పిర్యాదు చేసారు. పిర్యాదు తీసుకున్న ఎఎస్ ఐ రమేష్ చాకచక్యంగా వ్యవహరించి బాదితునికి ₹34000 నగదు దుస్తులు ఉన్న నగదును ఇప్పించారు. ఎయస్ ఐ రమేష్ ను పోలీసులు స్థానిక ప్రజలు అభినందించారు. దీంతో సోషల్ మీడియాలో శభాష్ పోలీస్ అన్నా అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!