Social 1080×1350 • Multi-page
13-06-2024 BREAKING NEWS 07:25 AM
swarnodayam.com
Telugu Daily News

కాట్రపల్లిలో స్కూల్ యూనిఫాంల పంపిణి

కాట్రపల్లిలో స్కూల్ యూనిఫాంల పంపిణి
IMG-20240613-WA0110

మండల యాదగిరి, స్వర్ణ ఉదయం ప్రతినిధి హుజురాబాద్: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు గురువారం స్కూల్ యూనిఫాంలు పంపిణి చేశారు. కాట్రపల్లి గ్రామ ఎంసిటిసి సభ్యురాలు రావుల అనిత వెంకట్ లు విద్యార్థులకు స్కూల్ యూని ఫేమ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల ప్రారంభం రోజుననే పాఠశాలలోని విదార్థులందరికి ఉచితంగా పాఠ్యపుస్తకాలను, స్కూల్ యూనిఫాంలు అందజేస్తుందని పేర్కోన్నారు. అదేవిధంగా గ్రమస్తులు, ఉపాధాయులు పాఠశాలలో అత్యధిక మంది విద్యార్థులు వేరే విధంగా కృషిచేస్తూ పాఠశాల అభివృద్ధికి పాటు పడాలన్నారు. అదేవిధంగా పాఠశాలలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాట్రపల్లి ఎంపిటీసీ రావుల అఖిత – వెంకట్ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు కుమార్, బిక్షపతి, నర్సింహచారి, అనిల్, రమేష్, మమత, భవానీలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!