Social 1080×1350 • Multi-page
13-06-2024 BREAKING NEWS 07:33 AM
swarnodayam.com
Telugu Daily News

బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జక్కని సంజయ్ కుమార్

బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జక్కని సంజయ్ కుమార్
IMG-20240613-WA0155

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామానికి చెందిన జక్కని సంజయ్ కుమార్ ను నియమిస్తూ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు, గురువారం హైదరాబాద్ లోని బీసీ భవన్ లో రాష్ట్ర స్థాయి కోర్ కమిటీ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జక్కని సంజయ్ కుమార్ నియమితులయ్యారు, గత 10 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలలో భాగసౌమ్యం అయి, బీసీ ఉద్యమాలు చేస్తున్న జక్కని సంజయ్ కుమార్ ను ఆర్ కృష్ణయ్య ప్రశంసించారు, ఇక ముందు కూడా బీసీల హక్కుల కోసం పోరాటాలను ముందుకు నడపాలని సూచించారు.

ఈ కోర్ కమిటీ సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగే మల్లేష్ యాదవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిలపల్లి ఆంజనేయులు, వేముల రామకృష్ణా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, కేంద్ర కార్యాలయ ఇంచార్జి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా తన నియామకానికి సహరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో ఆర్డినేటర్ డా. అరుణ్ కుమార్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణలకు సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!