Social 1080×1350 • Multi-page
13-06-2024 BREAKING NEWS 09:49 AM
swarnodayam.com
Telugu Daily News

నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను సవరించాలని జమ్మికుంటలో రాస్తారోకో

నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను సవరించాలని జమ్మికుంటలో రాస్తారోకో
IMG-20240613-WA0120

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జమ్మికుంట:

కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండల కేంద్రంలో ఎన్ ఎస్ యుఐ మండల అధ్యక్షుడు వాసాల సుధీర్, ఎన్ ఎస్వి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వేజ్ మహమ్మద్ ఆధ్వర్యంలో జమ్మికుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షులు సజద్ మొహమ్మద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ.. 2016లో నీట్ అనే పరీక్షను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఇది ఎంబీబీఎస్ చదవడం కోరకై ఎంట్రెన్స్ పరీక్షగా నీట్ ను నిర్వహించారు. అందులో ఎన్ టిఏ అనే సంస్థ నేడు ఈ పరీక్షల ఫలితాల విడుదలలో అవకతవకలు చేస్తూ ఈనెల 14వ తేదీన విడుదల కావలసిన పరీక్ష ఫలితాలను 10 రోజుల ముందుగానే విడుదల చేయడానికి ఇది ముమ్మాటికి స్కామ్ అని తేటతెల్లమైందన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఎన్ఎస్యుఐ మరియు యూత్ కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి భారీ స్థాయిలో పోరాటాలు చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థుల జీవితాలను ఎంబిబిఎస్ సీటును వారు బ్యాంకులలో లోన్లు తీసుకొని వారి బంగారాన్ని సైతం కుదపెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తును బంగారమయం చేయాలనే ఉద్దేశంతో వారు రెండు సంవత్సరాలు అప్పులు చేసి నీట్ కోచింగ్ లకు పంపిన కూడా నేడు ఈ ప్రభుత్వం వారిపై కనీస కనికరం లేకుండా చేస్తుందన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు చాంద్ పాషా, ఫయాజ్ , అనిల్, సురేష్, వేణు, శశి, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!