14-06-2024 NORMAL NEWS 12:15 AM
swarnodayam.com
Telugu Daily News
14-06-2024 12:15 AM By Mandala Yadagiri

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..
IMG-20240614-WA0063

-పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి: పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరును పునరుద్ధరించారు. అలాగే రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు చేసి అమలు చేయనున్నారు.

పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే?

  • వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు)
  • దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)
  • కుష్టుతో వైకల్యం సంభవించిన వారికి ₹6,000
  • కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000(గతంలో ₹5వేలు)
  • మంచానికి పరిమితమైన వారికి ₹15,000 (గతంలో ₹5వేలు) ఈ విధంగా అర్హులకు పింఛను డబ్బులు నెలనెలా అందనున్నాయి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!