14-06-2024 NORMAL NEWS 01:16 AM
swarnodayam.com
Telugu Daily News
14-06-2024 01:16 AM By Mandala Yadagiri

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బి.ఆర్.ఎస్. నాయకులపై హుజురాబాద్ ఏసిపికి కాంగ్రెస్ ఫిర్యాదు…

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బి.ఆర్.ఎస్. నాయకులపై హుజురాబాద్ ఏసిపికి  కాంగ్రెస్ ఫిర్యాదు…
IMG-20240614-WA0090

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: గత 10 రోజులుగా కొందరు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మంత్రి పోన్నం ప్రభాకర్ పైన మరియు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురించి ‘సోషల్ మీడియా ‘వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం హుజూరాబాద్ ఏసిపి శ్రీనివాస్జీ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా స్థాయికి మించి మంత్రిపై, నియోజకవర్గం ఇన్చార్జి ప్రణవ్ పై అనవసరపు ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారంగా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, సొల్లు బాబు, మేకల తిరుపతి, కొలిపాక శంకర్, నేరేళ్ళ మహేందర్ గౌడ్, సందమల్ల బాబు, చల్లూరి రాహుల్, మహిళా నాయకురాల్లు వేముల పుష్పలత, లంకదాసరి లావణ్య, ఆలేటి సుశీల, పుల్ల రాధ, యండి కరీమా, లక్ష్మీ, దుబాసి బాబు, కుర్ర శ్రీనివాస్ గౌడ్, నర్సింగ్, సమ్మెట సంపత్, తాళ్ళపెల్లి రమేష్, బండారి సదానందం, మోరె తిరుపతి, గంటా కిరణ్ రెడ్డి, గడ్డం రాఘవేంద్ర, కడారి తిరుమలతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!