14-06-2024 NORMAL NEWS 01:30 AM
swarnodayam.com
Telugu Daily News
14-06-2024 01:30 AM By Mandala Yadagiri

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య
IMG-20240614-WA0094

స్వర్ణ ఉదయం ప్రతినిధి, మహబూబాబాద్: అన్యోన్యంగా కలిసి ఉన్న భార్యాభర్తల్లో ఒకరి మరణాన్ని తట్టుకోలేక మరొకరు తనువు చాలించిన సంఘటన పలువురిని కలచివేసింది. వివరాలలోకి వెళితే..మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతుగూడెం తండాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మాలోతు రవి గత వారం క్రితం సంగెం మండల కేంద్రంలో అతని అత్త చనిపోతే వాళ్ళ ఇంటికి మందలించడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో సంగెం వద్ద 2 వీలర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో మృతి చెందాడు. అది జీర్ణించుకోలేక భార్య సరిత రౌతుపెళ్లి గ్రామంలో బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఒకరి వెనుక ఒకరు ఏకంగా తమ ఉసురు తీసుకొని కుటుంబానికి దూరం కావడం ఆ తండాలో పెను విషాదం నింపింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!