Social 1080×1350 • Multi-page
14-06-2024 BREAKING NEWS 01:41 AM
swarnodayam.com
Telugu Daily News

ఏఐఎస్ బి 74వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి..

ఏఐఎస్ బి 74వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి..
IMG-20240614-WA0096

–ఏఐఎస్ బి 74వ వార్షికోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్య కిరణ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ నెల 25న జరిగే ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ 74 వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలో 74వ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వార్షికోత్సవాల పోస్టర్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ కొలుగూరి సూర్యకిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహోన్నతమైన వ్యక్తి, నిష్కలంక దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనుబంధ విద్యార్థి విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ అని అన్నారు. 1951లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పడి దేశ పునర్నిర్మాణం కొరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలలు కన్నా సమ సమాజ స్థాపన కొరకు పనిచేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రభుత్వ విద్య సంస్థల యూనివర్సిటీల పరిరక్షణకై విద్యా కార్పోరేటికరణకు వ్యతిరేకంగా గత 73 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో సైతం విద్యారంగ సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటాలు చేయడానికి ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్ ఎప్పుడూ ముందు ఉంటుదని తెలిపారు. అటువంటి మహోన్నతమైన చరిత్ర కలిగిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ 74వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్ నాయకులు కుక్కముడి రాజేష్, కొండ్ర నగేష్, వినయ్, సాగర్, రాము, నవీన్, రాకేష్, అజయ్, అంజి, జయరాం తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!