14-06-2024 NORMAL NEWS 02:58 AM
swarnodayam.com
Telugu Daily News
14-06-2024 02:58 AM By Mandala Yadagiri

యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శిగా మహమ్మద్ సూఫీయన్ నియామకం

యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శిగా మహమ్మద్ సూఫీయన్ నియామకం
IMG-20240614-WA0101

స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్, జూన్ 14:- యువజన కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శిగా నగరానికి హౌసింగ్ బోర్డు డివిజన్ నెంబర్ 7కు చెందిన మహమ్మద్ సూఫీయాన్ ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ కరీంనగర్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అమీర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుఫియన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పథకాలు ప్రజల్లో తీసుకువెళ్తనని, యూత్ కాంగ్రెస్ బలోపేతం కోసం తన వంతు శాయ శక్తుల కృషి చేస్తానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ , మానకొండూరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా యువజన అధ్యక్షుడు పడాల రాహుల్, కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జ్ సయ్యద్ ఖాలిద్ అహ్మద్ కు, టిపిసిసి అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు, నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, 07 దివిజన్ కార్పొరేటర్ ఆకుల పద్మ – ప్రకాష్, యూత్ కాంగ్రెస్స్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మహమ్మద్ అమీర్, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!