Social 1080×1350 • Multi-page
14-06-2024 BREAKING NEWS 09:27 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రపంచ కమ్యూనిస్టు యోధుడు చేగువేరా జయంతి

ప్రపంచ కమ్యూనిస్టు యోధుడు చేగువేరా జయంతి
IMG-20240614-WA0135

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


ప్రముఖ కమ్యూనిస్టు విప్లవ కారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా యుద్ధ తాంత్రికుడు చేగువేరా జయంతి కార్యక్రమాన్ని హుజురాబాద్ లోనీ అంబేద్కర్ చౌరస్తా దగ్గర జ్యోతిరావు పూలే జయంతి కమిటీ మాజీ చైర్మన్ సందెల వెంకన్న ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ జిల్లా నాయకుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ చేగువేరా ఆనాటి లాటిన్ అమెరికా దేశంలో పర్యటించి అక్కడ పేద ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను చూసి చలించి వీటికి కారణం పెట్టుబడిదారీ వ్యవస్థ, వలసవాదం, సామ్రాజ్యవాదం మొదలైన వాటిని కారణాలుగా గుర్తించిన గొప్ప నాయకుడు అన్నారు. నాటి నియంత పాలకుడైన పుల్ జెన్సీ యో బాటిస్తా పై జరిగిన గరిల్ల యుద్ధంలో విజయం సాధించి ఫెడరల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా ప్రజలను విముక్తి చేశాడన్నారు. 1959 భారతదేశాన్ని సందర్శించి గొప్ప ప్రజాస్వామ్య నాయకులను కలిశానని ఒక నివేదికను తయారుచేసి ఫెడ్రల్ కాస్ట్రో కి అందించాడనీ తెలిపారు. ప్రపంచ దేశాల్లో శ్రామిక వర్గ నాయకుడుగా గుర్తించబడ్డారని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంఐఫ్ గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొల్లు బాబు, బాబు జగ్జీవన్ రాం జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్, భారత్ బచావో సీనియర్ నాయకులు భీమోజు సదానందం, అన్నా డి సత్తిరెడ్డి, సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం, కాంగ్రెస్ నాయకులు తిప్పారపు భువన చంద్ర, తాళ్లపల్లి అమరేందర్ గౌడ్, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, కళాకారులు రామ్ రాజేశ్వర్, రామ్ సారయ్య, మొలుగూరి కొమరయ్య, కండే తిరుపతి, ఏనూరి అశోక్, దాట్ల ప్రభాకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!