Social 1080×1350 • Multi-page
14-06-2024 BREAKING NEWS 11:16 AM
swarnodayam.com
Telugu Daily News

కన్న కొడుకే కాలయముడయ్యాడు.. బంగారం కోసం తల్లి దండ్రులనే కడ తేర్చిన కసాయి కొడుకు.

కన్న కొడుకే కాలయముడయ్యాడు.. బంగారం కోసం తల్లి దండ్రులనే కడ తేర్చిన కసాయి కొడుకు.
IMG-20240614-WA0157

–పేగు బందం మర్చిపోయి మానవ మృగలుగా మారిన కొడుకు, కోడలు

–ఆడ బిడ్డ తల్లి దండ్రుల జాడ కొరకు వెతకని ఊరు లేదు, వెతకని జాడ లేదు

–ఆడ కూతురు ఆందోళనతొ కిష్టయ్య, నర్సమ్మ ల మరణ వార్త బయట పడింది

25 రోజుల తర్వాత వీడిన సాకలి కిష్టయ్య, నర్సమ్మ డెత్ మిస్టరీ

స్వర్ణోదయం ప్రతినిధి, సంగారెడ్డి: అతనొక నరరూప రాక్షస పుత్రుడు. అతడు చేసింది అంతా ఇంతా కాదు. అత్యాసకు పోయి దురు వ్యసనాలకు లోనై కన్న తల్లి దండ్రులనే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలానికి చెందిన సాదుల్లనగర్ నివాసి అయిన సాకలి లక్ష్మన్ బ్రతుకు తెరువు కొరకు దుండగల్ లో ఒక ప్రైవేట్ ఉద్యోగం చెయ్యడానికి వెళ్ళాడు. అక్కడ అనేక దురువ్యసనాలకు లోనైన లక్ష్మన్ డబ్బుల కొరకు కన్న తల్లి మెడలో ఉన్న బంగారంపై కన్ను పడింది. ఎలాగైనా బంగారం తల్లి దగ్గర నుండి తీసుకోవడానికి పక్కా పథకం ప్రకారం గత నెల మే 22 న తన తల్లి తండ్రులను దుండిగల్ తీసుకెళ్లాడు. అందరూ కలిసి ఆల్కహాలు సేవించి విందు చేసుకున్నారు. నిందితుడి భార్యతో కలిసి 3.5 తులాల బంగారం మీద కన్నేసి సమయం కోసం ఎదురు చూశారు. ఎక్కడి వాళ్ళు అక్కడి నిద్రలో జరుకున్న తర్వాత సొంత తల్లి దండ్రులను గొంతునులిపి కడతేర్చాడు. దానికి అతని భార్య అనిత పూర్తిగా సహకరించినట్టు తెలిసింది. ఆ తర్వాత కారులో నర్సాపూర్ అటవీ సమీపంలోని రాయరావు చెరువు చెట్ల పొదల్లో తల్లిదండ్రుల శవాలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు నికృష్టపు కొడుకు. ఇట్టి విషయాన్ని గప్ చుప్ గా ఉంచిన భార్య భర్తలు ఏమి తెలువనట్టు ఉన్నారు. ఆడ బిడ్డ తల్లి దండ్రుల జాడ కొరకు వెతకని ఊరు లేదు, వెతకని జాడ లేదు. ఇక పుట్టిన ఊరికి వచ్చి తన తల్లిదండ్రుల గురించి వాకబు చేసింది. అంతలో సాదుల్లా నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ప్రజలు గుమిగూడి కిష్టయ్య, నర్సమ్మ ల గురించి కొడుకు లక్ష్మన్ ని అడకూతురు గ్రామస్తులు కలిసి నిలదీశారు. గ్రామస్తులు కలిసి తల్లిదండులను నీవే తీసుకపోయావు ఏమిచేశావు అంటూ నిలదీయ్యడంతో నిందితుడు ఖంగుతున్నాడు. గ్రామస్తులు అందరూ కలిసి లక్ష్మన్ పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో తల్లిదండ్రులను తానే చంపినట్టు అంగీకరించినట్టు తెలిసింది. ఈ విషయమై నింధితులైన లక్ష్మన్ అతని భార్య అనితను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. కన్న తల్లిదండ్రులను కర్కశంగా కడ తేర్చిన కసాయి కొడుకు గురించి తెలిసి సభ్య సమాజం తలదించుకుంటుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!