Social 1080×1350 • Multi-page
15-06-2024 BREAKING NEWS 12:17 AM
swarnodayam.com
Telugu Daily News

పాపయ్యపల్లిలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన వినోద్ రెడ్డి

పాపయ్యపల్లిలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన వినోద్ రెడ్డి
IMG-20240615-WA0017

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

కాంగ్రేస్ ప్రభుత్వo ప్రతిష్టత్మకంగా చెపట్టిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మండలంలోని పెద్దపాపయ్యపల్లె గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ నాయకుడు వైద్యుల వినోద్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు అందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివేల ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య ఉంటుందని, అలాగే అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. పిల్లలకు మంచి నడవడిక నేర్పిస్తారనీ మరియు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను బోదిస్తున్నారని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కుసుమ రాజమౌళి, ఉడుత ప్రణయ్, పాకాల మధుకర్ రెడ్డి, రాసపల్లి ఓదెలు, ప్రేమ్, ఏండి చాంద్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!