Social 1080×1350 • Multi-page
15-06-2024 BREAKING NEWS 07:00 AM
swarnodayam.com
Telugu Daily News

నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్, స్టేషనరీ, పుస్తకాలు విక్రయిస్తే దాడులు చేస్తాం: ఏఐఎస్ఎఫ్

నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్, స్టేషనరీ, పుస్తకాలు విక్రయిస్తే దాడులు చేస్తాం: ఏఐఎస్ఎఫ్
IMG-20240615-WA0095

మండల యాదగిరి, స్వర్ణ ఉదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డివిజన్లో, జిల్లాలో పలుచోట్ల గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలను అడ్మిషన్ ముసుగులో ఫీజుల మొత మోగిస్తున్నాయని, గుర్తింపు లేని పాఠశాలలను గుర్తించి ఆయా పాఠశాలను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి దోమ్మాటి వేణుగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజురాబాద్ మండల కేంద్రంలో శనివారం ఏఐఎస్ఎఫ్ హుజురాబాద్ మండల కౌన్సిల్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దోమ్మాటి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పర్మిషన్స్ లేకుండానే అడ్మిషన్ చేస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నాయని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు మోతలు మోగిస్తున్న మండల విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప గుర్తింపు లేని పాఠశాలలను గుర్తించి ఆ పాఠశాలలో పై చర్యలు తీసుకోవడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను నియంత్రించడంలో ప్రభుత్వాలు గానీ ప్రభుత్వ అధికారులు గానీ ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను సంతలో సరుగ్గా మార్చేశాయని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఆయా విద్యా సంస్థలు మార్కెట్ కేంద్రాలుగా తలపిస్తు విద్యను పూర్తిగా వ్యాపార పరం చేస్తున్న మండల విద్యాశాఖ అధికారి పట్టించుకోవడం లేదన్నారు. ఆయా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అడ్మిషన్స్ తీసుకుంటే డొనేషన్లు, బుక్స్ కు సపరేట్, యూనిఫామ్ సపరేట్ ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకు 25% ఫీజు రాయితీ ఇవ్వాలని నిబంధనలు ఉన్న ఆ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. జర్నలిస్ట్ పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించాలని తల్లిదండ్రుల ఆశను ఆసరాగా మలుచుకున్న. కార్పొరేట్ ప్రవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులు దోపిడీకి పురి కోలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి కార్పొరేట్ విద్యాసంస్థల కరికులం పేరుతో విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు బనాయించి ఫీజులు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ హుజురాబాద్ మండల సమితి డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి రాపేల్లి రోహిత్, అనూప్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!