Social 1080×1350 • Multi-page
15-06-2024 BREAKING NEWS 07:34 AM
swarnodayam.com
Telugu Daily News

ఇంటర్ కళాశాలలపై విచారణ జరపాలి – యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ

ఇంటర్ కళాశాలలపై విచారణ జరపాలి – యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ
IMG-20240615-WA0135

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ కళాశాలల ఫీజులపై మరియు వాటి వసతులపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలిలో కార్యాలయం ఇన్చార్జి వసుంధర దేవికి వినతిపత్రం అందించడం జరిగింది. అనంతరం ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ…. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు జూనియర్ కళాశాలల ఫీజులపై మరియు వాటి వసతులపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. అనేక కళాశాలలో కనీస వసతులు లేకుండా ముద్దు ముద్దు పేర్లతో మెయిన్స్ నీట్ ప్రత్యేక తరగతులు ఈ సెక్షన్లో చేరితే ఖచ్చితంగా సీటు వస్తుందని అనే పేర్లతో లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కనీసం అనుభవం లేని ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో కాలేజీలో సాధించిన ర్యాంకుతో ప్రచారం చేసుకుంటూ ప్రచార నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఎత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక కళాశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు మూత్రశాలలు మరుగుదొడ్లు లేకుండా కళాశాల నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యజమాన్యాలకు అధికారులు అమ్ముడుపోవడం వలన కళాశాలలపై విచారణ జరపడం లేదని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా విస్తరించి వారికి నచ్చిన విధంగా వ్యవహరించారని అన్నారు. ఈ ప్రభుత్వము అయినా ఆ కళాశాలపై కట్టడి చేయాలని కోరారు. కరీంనగర్, హనుమకొండ, వరంగల్ డిఐఈఓ ల పై సమగ్ర విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ అధికారులు ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి కళాశాలలపై విచారణ ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశలవారి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ వినతి పత్రం అందించిన వారిలో రాష్ట్ర సహాయ కార్యదర్శి చెదలాపురం మధు, రాష్ట్ర నాయకులు బి వెంకట్, కోటేష్, తిరుపతి, రాజేష్, వికాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!