Social 1080×1350 • Multi-page
15-06-2024 BREAKING NEWS 09:05 AM
swarnodayam.com
Telugu Daily News

గదుల యజమానులను వేధిస్తున్న పాలకవర్గము.. తట్టుకోలేక దుకాణదారుడి ఆకస్మిక మృతి… దుకాణదారుల ఆరోపణ

గదుల యజమానులను వేధిస్తున్న పాలకవర్గము.. తట్టుకోలేక దుకాణదారుడి ఆకస్మిక మృతి… దుకాణదారుల ఆరోపణ
IMG-20240615-WA0125

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:

హుజురాబాద్ మునిసిపల్ కార్యాలయ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ గదుల యజమానులను మున్సిపల్ పాలకవర్గం వేధిస్తున్నారని గదుల యజమానులు ఆరోపించారు, శనివారం షాపింగ్ కాంప్లెక్స్ గదుల యజమానులు చల్లూరి రఘుచారి, ఎన్ రమేష్, రవీందర్, ప్రదీప్, రామకృష్ణ తదితరులు గుండెపోటుతో మృతి చెందిన ఓ దుకాణదారుడు ఫ్లెక్సీలు పెట్టుకొని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఎంతోకాలంగా కాంప్లెక్స్ లోని షట్టర్లలో జీవనోపాధి పొందుతున్న తమను మున్సిపల్ పాలకవర్గం రెగ్యులరైజ్ చేయడానికి ఒక్కో దుకాణదారుడు వద్ద రూ .50,000 చెల్లించాలని, కానీ రసీదు మాత్రం రూ.1000, 1500లకు ఇస్తామంటూ తమ వద్ద డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వక పోయినట్లయితే సదరు దుకాణాలకు తిరిగి ఓపెన్ టెండర్ పిలుస్తామని అంటు బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. పాలకవర్గం చేస్తున్న ఒత్తిడి వల్ల ఇటీవలనే ఓ షెటర్ను కొనుగోలు చేసిన ఆకుల విజయ్ కుమార్ అనే ఒక గది యజమాని తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో రాత్రి మృతి చెందాడని వారు పేర్కొన్నారు. ఎంతోకాలంగా జీవనోపాధి కోసం షట్టర్లలో వ్యాపారం చేసుకుంటున్న తమను పాలకవర్గం వేధింపుల నుండి తమను కాపాడాలని వారు కోరారు.


Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!