Social 1080×1350 • Multi-page
16-06-2024 BREAKING NEWS 02:42 AM
swarnodayam.com
Telugu Daily News

మైనర్ బాలిక సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

మైనర్ బాలిక సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
IMG-20240616-WA0061

స్వర్ణోదయం ప్రతినిధి, పెద్దపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేపిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్ లో మైనర్ బాలిక అత్యాచార, హత్య ఘటన స్థలాన్ని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, దనసరి సీతక్క, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ,
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు లు సందర్శించి పరిశీలించారు. రామగుండం సిపి శ్రీనివాసును ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని, నేరస్తులను కఠినంగా శిక్షించేలా చూడాలని పోలీసు అధికారులను మంత్రులు ఆదేశించారు. వారి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!