16-06-2024 NORMAL NEWS 05:43 AM
swarnodayam.com
Telugu Daily News
16-06-2024 05:43 AM By Mandala Yadagiri

హుజురాబాద్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

హుజురాబాద్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
IMG-20240616-WA0086

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 7 సేవా కార్యక్రమాలలో భాగంగా ఆదివారం గాయత్రీ టిఫిన్ సెంటర్ ముందట ఏర్పాటు చేసిన సమావేశంలో డాన్ టు డాస్క్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వాసవి మాత చిత్రపటం ముందట జ్యోతి ప్రజ్వలన గావించి వాసవి మాత గీతాన్ని ఆలపించారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఐదుగురికి బ్లైండ్ స్టిక్స్ పంపిణీ చేశారు. అలాగే 40 మంది విద్యార్థులకు బుక్కు, పెన్స్, వాసవి క్లబ్బులో పదిమందికి నూతన సభ్యత్వాన్ని చేర్పించారు. ఓ పేద వ్యక్తికి తోపుడు బండి అందించారు, ట్రాఫిక్ సిబ్బందికి ఫ్లోరా సెట్ జాకెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వాసవి క్లబ్ అతిథులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి తెనాలి నుండి వాసవి క్లబ్ అడిషనల్ వైస్ ప్రెసిడెంట్ మాల్దీపులు వెంకటసుబ్బయ్య, ఆర్సి గంప సురేందర్, జెడ్ సి అయిత రమ, గెస్ట్ ఆఫ్ హానర్ గా ఎల్లంకి లచ్చయ్య, గందే ప్రవీణ్ కుమార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మున్సిపల్ చైర్మన్ గందె రాధిక హాజరై అతిథులతో కలిసి వారికి పలు వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ నంగునూరు శైలజ, సెక్రెటరీ గోలి హిమబిందు, ట్రెజరర్ శివనాధుని స్వప్న మరియు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!