Social 1080×1350 • Multi-page
16-06-2024 BREAKING NEWS 09:05 AM
swarnodayam.com
Telugu Daily News

మద్యం ప్రియుల జేబుకు చిల్లు..?

మద్యం ప్రియుల జేబుకు చిల్లు..?
IMG-20240616-WA0115(1)

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు షాక్ తగలనుంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. ఎన్నికల కారణంగా పెంచలేదు. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇదే గనుక జరిగితే మద్యం ప్రియుల జేబుకు చిల్లు పడక తప్పదని మద్యం ప్రియుల గుసగుస.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!