Social 1080×1350 • Multi-page
17-06-2024 BREAKING NEWS 05:22 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ కి వన్నెతెచ్చిన తపస్వి డాన్స్ అకాడమీ

హుజురాబాద్ కి వన్నెతెచ్చిన తపస్వి డాన్స్ అకాడమీ
IMG-20240617-WA0068

-అక్కాచెల్లెళ్లకు ఏ అవసరం ఉన్న నేనున్నా

-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఒక వెయ్యి ఎనిమిది మంది మహిళలచే గోవింద నామాలతో కోలాట మహా బృంద నృత్యం ద్వారా హుజురాబాద్ లోని తపస్వి డాన్స్ అకాడమీ ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, సహస్ర మహోత్సవ సామ్రాట్ శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వారి గ్లోబల్ డివోషనల్ రికార్డ్స్ ను సాధించి హుజురాబాద్ కు వన్నె తీసుకువచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం హుజరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయి రికార్డు నెలకొల్పడం ఎంతో శుభ పరిణామని ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహించిన నృత్య దర్శకురాలు శ్రీమతి డా. చిలమకూరి శ్వేతా (సీతారత్నం) ఎంతో ప్రశంసనీయురాలని కొనియాడారు. ప్రభుత్వాలు ఏవైనా కళాకారుల అభివృద్ధి కోసం తన వంతు బాధ్యతతో కృషి చేస్తానని కళాకారులకు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి హుజరాబాద్ కు విచ్చేసిన కళాకారులు అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అక్కచెల్లెళ్లకు ఏ అవసరం ఉన్న తనను సంప్రదించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చాను వాటిని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఏ మహిళకు ఆపద వచ్చిన తనకు ఫోన్ చేస్తే తనవంతు సహాయ సహకారాలు తప్పక అందిస్తానని హామీ ఇచ్చారు. బృందాలను తీసుకువచ్చిన మహిళలకు లక్కీ డ్రా ద్వారా వెండి కాయిన్స్ డ్రా చేస అందజేశారు . ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, హుజురాబాద్ లోని ప్రముఖులు, డాన్స్ అకాడమీ నిరాకరాలు శ్వేతరత్నం, పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారులు, కళాభిమానులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!