Social 1080×1350 • Multi-page
18-06-2024 BREAKING NEWS 02:30 AM
swarnodayam.com
Telugu Daily News

పిడి కొన్నీ రాజిరెడ్డికి ఘన సన్మానం

పిడి కొన్నీ రాజిరెడ్డికి ఘన సన్మానం
IMG-20240618-WA0031

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణానికి చెందిన సిద్ధార్థనగర్ కు చెందిన కొన్ని రాజిరెడ్డి ఇటీవల ఫిజికల్ డైరెక్టర్ గా ఉద్యోగవిరమణ చేయగా పివి సేవాసమితి, అలయన్స్ క్లబ్ హుజురాబాద్ శాఖ వారు ఘనంగా సన్మానించి నూతన వస్త్రాలతో రాజిరెడ్డి దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా కొన్ని రాజిరెడ్డి సేవలను వారు కొనియాడారు. ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఫిట్నెస్ కోచింగ్ ఇస్తూ ఉదోగ అవ కాశాలు కల్పించిన వ్యక్తి అని వక్తలు పేర్కొన్నారు. ఆదర్శప్రాయమైన
సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఎన్నో గుర్తిపు పత్రాలు, అవార్డులతో
గౌరవించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పివి సేవాసమితి అలయన్స్అధ్యక్షులు టి వెంకటరెడ్డి, బి మనోజ్, కౌన్సిలర్ స్వరూపముత్యంరావు, సిద్ధార్థ నగర్ కాలని అధ్యక్షులు సాగి వీరభద్రరావు, ప్రదాన కార్యదర్శులు టి.మాధవరావు, బి.సంపథరెడ్డి
డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ టి విద్యాసాగర్, ఉపాధ్యాయులు, సాధానందం, మనోజ్, ఎన్ తీరుపతిరెడ్డి, పొల్సాని
శ్రీనివాసరావు, పి.సుధాకర్, ఎం.కన్నయ్య, శ్రీహరి, యు రాజమౌళి అధ్యాపకులు మల్లయ్య తధితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!