19-06-2024 NORMAL NEWS 02:39 AM
swarnodayam.com
Telugu Daily News
19-06-2024 02:39 AM By Mandala Yadagiri

త్యాగాల కుటుంబం.. సోనియా గాంధీ కుటుంబం..

త్యాగాల కుటుంబం.. సోనియా గాంధీ కుటుంబం..
IMG-20240619-WA0094

-హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్బంగా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పటాకలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
హుజురాబాద్ చౌరస్తాలో 53 కేజీల భారీ కేక్ ను వోడితల ప్రణవ్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులకు తినిపించారు..అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళలకు వోడితల ప్రణవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి బ్రేడ్స్, అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న వసతులు, ఆస్పత్రి వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకొని మరింత మెరుగుగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. త్యాగాల కుటుంబం సోనియా రాహుల్ గాంధీ కుటుంబమని వారి సేవలు దేశ ప్రజలకు ఎనలేనివని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!