Social 1080×1350 • Multi-page
19-06-2024 BREAKING NEWS 06:18 AM
swarnodayam.com
Telugu Daily News

తాటి చెట్లు తీసివేసిన వ్యక్తిపై చట్ట పరమైన చర్య తీసుకుకోవాలి..

తాటి చెట్లు తీసివేసిన వ్యక్తిపై చట్ట పరమైన చర్య తీసుకుకోవాలి..
IMG-20240619-WA0122

-సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో సొప్పరి తిరుపతి అనే వ్యక్తి తన భూమిలో ఉన్న 80 తాటి చెట్లు కల్లు తీసేవి అర్ధరాత్రి ఎవరు లేని టైంలో కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి అనుమతి లేకుండా తీసి వేసి గీతా కార్మికుల పొట్టమీద కొట్టారని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్ తెలిపారు. బుధవారం విలాసాగర్ గ్రామంలో తాటి చెట్లు తీసివేసిన తాటివనంను సందర్శించి చలించి పోయారు. తాటిచెట్లనే నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న గీతా కార్మికులు బోరున విలపించారు. చెట్లు తీసివేసిన సొప్పరి తిరుపతి పై ఆబ్కారీ శాఖ అధికారులు చట్టపరమైన చర్య తీసుకోవాలని గీతా కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భముగా ఆబ్కారీ శాఖ జమ్మికుంట సిఐ మాధవిలతతో జక్కే వీరస్వామిగౌడ్ మాట్లాడారు. సిఐ స్పందిస్తు తప్పకుండా తిరుపతి పై శాఖ పరమైన కటిన చర్యలు తీసుకుంటామని గౌడ సంఘము నాయకులకు గీతా కార్మికులకు హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భముగా వీరస్వామిగౌడ్ మాట్లాడుతు రాష్ట వ్యాప్తంగా గీతా కార్మికుల పరిస్థి చాలా దారుణంగా ఉందని గీతా కార్మికులను పట్టించుకొనే నాధుడే లేడని, ఎలక్షన్ ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన ప్రజా ప్రతినిధులు ఓట్లు వేసిన తరువాత మర్చి పోయారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని గీతా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని గీతా కార్మికుల తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘము అద్యక్షులు సిరిసెటి ఓదెలుగౌడ్, ఉపాధ్యక్షులు ముంజాల చెంద్రయ్యగౌడ్, నాయకులు అరెల్లి రవిగౌడ్, అరెల్లి అశోక్ గౌడ్, ముంజాల సదయ్యగౌడ్, ముంజాల శ్రీనివాస్ గౌడ్, గోపగోని రాజయ్యగౌడ్, ముంజాల రవిగౌడ్, గీతా కార్మికులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!