Social 1080×1350 • Multi-page
20-06-2024 BREAKING NEWS 09:28 AM
swarnodayam.com
Telugu Daily News

సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగించిన ప్రైవేట్ సంస్థ..!

సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగించిన ప్రైవేట్ సంస్థ..!
IMG-20240620-WA0106

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఓ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా గచ్చిబౌలితో పాటుగా ఐదు బ్రాంచ్ లు ఓపెన్ చేసింది ఈ సంస్థ.
ఉద్యోగాలు ఇస్తామాంటూ 800 మంది నిరుద్యోగుల దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది. ఒక్కో ఉద్యోగి దగ్గర రూ.40 వేల నుంచి 50వేల రూపాయలు వసూలు చేసింది ఈ సంస్థ.
ఒక్క గచ్చి బౌలిలోనే దాదాపుగా 40 లక్షల రూపాయల వసూలు చేసింది. రూ. 5 కోట్ల రూపాయలు వసూలు కాగానే కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామాంటూ యాజమాన్యం నిరుద్యోగులకు షాకిచ్చింది. కంపెనీ చేసిన మోసంతో దాదాపుగా 100 మంది ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు. దీంతో బాధితులంతా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగులు ఇప్పటికైనా మోసపూరిత కంపెనీలను ఆశ్రయించి నష్టపోకుండా పూర్తి సమాచారం తెలుసుకున్నాకనే ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని పోలీసులు కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!