Social 1080×1350 • Multi-page
22-06-2024 BREAKING NEWS 05:54 AM
swarnodayam.com
Telugu Daily News

తీన్మార్ మల్లన్నకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి.. తీన్ మార్ మల్లన్న టీం హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ కొంగటి రాజ్ కుమార్.

తీన్మార్ మల్లన్నకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి.. తీన్ మార్ మల్లన్న టీం హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ కొంగటి రాజ్ కుమార్.
IMG-20240622-WA0097

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

తీన్మార్ మల్లన్నకి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలనీ
తీన్మార్ మల్లన్న టీం హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ కొంగటి రాజ్ కుమార్ శనివారం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గం తీన్మార్ మల్లన్న టీం తరుపున విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న మీద నమ్మకంతో టికెట్ ఇచ్చారనీ, అదే నమ్మకంతో మల్లన్న గెలిచాడన్నారు. 10 సంవత్సరల కాలంలో కేసిఆర్ ప్రభుత్వం మీద అలుపెరుగని పోరాటం చేసిన తీన్మార్ మల్లన్నపై ఎన్నో అక్రమ కేసులు పెట్టిన ప్రతి పక్షం లేని సమయంలో ప్రజల గొంతుక అయ్యారన్నారు. అదే గొంతుక కీలక నిర్ణయాలు తీసుకునే మీ కాబినెట్ లో ఉంటే ఏ నిరుద్యోగుల తరుపున గెలిచారో వాళ్ళకోసం పని చేసే అవకాశం ఉంటుదన్నారు. విద్య విషయంలో ఎంతో నిబద్దత కలిగిన వ్యక్తి మల్లన్న మాత్రమే అని తెలంగాణ సమాజం విశ్వసిస్తుందన్నారు. కావున విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజల గొంతును మీ పక్కన ఉంచుతారని కొంగంటి రాజుకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మండల అధ్యక్షులు హుజురాబాద్ తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!