Social 1080×1350 • Multi-page
23-06-2024 BREAKING NEWS 01:51 AM
swarnodayam.com
Telugu Daily News

హరితహారం ఇక వనమహోత్సవం.. పేరు మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం సన్నద్ధం!

హరితహారం ఇక వనమహోత్సవం.. పేరు మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం సన్నద్ధం!
IMG-20240623-WA0069

స్వర్ణ ఉదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హరితహారం పేరు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మొక్కలు పెంచే ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి ‘వన మహోత్సవం’ పేరుతో నిర్వహించాలని డిసైడ్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఈ కార్యక్రమాన్ని ‘తెలంగాణకు హరితహారం’ పేరుతో నిర్వహించేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పేరు మార్చారు. ఉమ్మడి తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వన మహోత్సవం పేరుతోనే పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా..75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి ‘వజ్రోత్సవ వన మహోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది.

తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, స్టీరింగ్‌ కమిటీలను కొత్తగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సమన్వయ కమిటీకి కలెక్టర్‌ ఛైర్మన్‌ గా వ్యవహరిం చనున్నారు. ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీకి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. ఎనిమిది మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. అయితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పలు అభివృద్ధి కార్యక్రమాల గత పేర్లు మార్చడం ప్రజలను అయోమయానికి గురిచేస్తుంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!